Saturday, March 14, 2026

ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి

జనతా న్యూస్ బెజ్జంకి : గుగ్గిళ్ళ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ కంపెనీ అనుమతులను మరియు నిర్మాణ పనులను తక్షణమే రద్దు చేయాలని గుగ్గిళ్ళ గ్రామ” ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ” ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ నోట్ ద్వారా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ కు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఎమ్మెల్యే తాను గెలుపొందుతే కంపెనీ రద్దు కోసం కృషి చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. మాట నిలబెట్టుకుంటూ కంపెనీ రద్దు కోసం బెజ్జంకి మండల ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page