Monday, November 2, 2026

మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ల పట్టివేత

  • రెండు టిప్పర్ల మట్టి ఖాళీ
  • మరో రెండింటికి నామమాత్రపు ఫైన్
  • గతంలో ‘జనత’లో మట్టి దందాపై కథనం

మానకొండూర్ నియోజకవర్గం, జనత న్యూస్: సిద్దిపేట జిల్లాలో సాగుతున్న మట్టి దందాపై అధికారులు ఫోకస్ చేశారు. తాజాగా మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పట్టికున్నారు. వీటిలో రెండింటి మట్టిని తహసీల్దార్ కార్యాలయం ముందు ఖాళీ చేయించారు. మరో రెండింటికి మాత్రం నామమాత్రపు ఫైన్ వేశారు. అయితే గతంలో ‘మానేరు జనత’లో మట్టి దందాపై కథనం వచ్చింది. దీనిపై అధికారులు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట స్టేజి సమీపానికి చిన్న కోడూరు మండలంలోని మల్లారం గ్రామం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న నాలుగు టిప్పర్ లను బెజ్జంకి మండల తహసీల్దార్ ఎర్రోళ్ల శ్యామ్ పట్టుకున్నారు. ఒక్కొక్కదానికి  3000 రూపాయల జరిమానా విధించారు.  గత నెల 26వ తేదీన ‘మానేరు జనతా’ లో ‘ఎన్నాళ్ళు ఈ మట్టి దందా.. పట్టించుకునే నాథుడే లేడా’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం పాఠకులకు తెలిసిందే. ఆ వార్త వచ్చిన మరుసటి రోజు నుంచి మట్టి తరలింపు ఆగిపోయింది. అయితే రెండు రోజుల నుంచి మళ్లీ రాత్రనక, పగలనక మట్టి తరలింపు సాగుతూనే ఉంది.

అయితే శుక్రవారం సాయంత్రం బెజ్జంకి తహసీల్దార్ మట్టితో ఉన్న నాలుగు టిప్పర్లను ముత్తన్నపేట శివారులో పట్టుకుని హుటాహుటిన వాటిని బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. గంట వ్యవధిలోని రెండు టిప్పర్ల మట్టిని తహసీల్దార్ కార్యాలయం ముందు ఖాళీ చేయించారు. ఇంకో రెండు టిప్పర్లు మట్టితో ఉన్న వాటిని వెనక్కి పంపారు. మట్టితో ఉన్న వాహనాలను వెనక్కి పంపడంపై మండలానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి జోక్యం ఉందని అనుకుంటున్నారు. వీటికి నామమాత్రంగా ఫైన్ వేసి తిరిగి అప్పగించినట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా అధికారి లేరు. ఫోన్ లో సంప్రదిస్తే అందుబాటులోకి రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా సదరు ప్రజాప్రతినిధి కనున్నల్లోనే జరుగుతుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టి తరలింపుపై దృష్టి పెట్టాలని మండలవాసులు కోరుతున్నారు.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page