Wednesday, October 28, 2026

నేడు ప్రత్యేక ఓటరు క్యాంప్.. 18 సంవత్సరాలు నిండిన వారికి అవకాశం..

  • 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకోవాలి
  •  కరంనగర్  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, జనతా న్యూస్: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.శనివారం కరీంనగర్ పట్టణంలోని వావిలాల పల్లిలో ఆల్ఫోర్స్, శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శనివారం, ఆదివారం అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆదివారం ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక క్యాంపును అర్హులైన, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఫామ్ 6 ద్వారా వారి దరఖాస్తును బిఎల్ఓ లకు అందించాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్, ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ సంధ్య రాణి, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ రమేష్, బిఎల్ఓ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page