Wednesday, November 4, 2026

తెలంగాణలో మరో ఎన్నికల పండుగ!

  •  తెలంగాణలో జనవరి-ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు..
  •  సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..
  •  సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు కోరిన అధికారులు
  •  పంపించిన గ్రామ కార్యదర్శులు..
  •  జనవరి 31వ తేదీతో పూర్తికానున్న సర్పంచ్‌ల పదవీకాలం

హైదరాబాద్, జనతా న్యూస్:తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల పండగ మొదలవనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా.. సర్పంచుల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదోతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాల కోసం జిల్లాల వారీగా నివేదిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు పంపించారు. ఆర్టికల్ 243E(3)(a) ప్రకారం గ్రామపంచాయితీల పదవీకాలం ఐదేళ్లు. కాగా.. పీరియడ్ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలుండగా.. లక్షా 13 వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page