జనతా న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామంలో చేపడుతున్నటువంటి “గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్”( ఇథనాల్ ) ఫ్యాక్టరీ అనుమతులు, నిర్మాణ పనులు రద్దు చేయాలని మంగళవారం గుగ్గిళ్ళ గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నిరవదిక రిలే ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇలాంటి ఫ్యాక్టరీలను జననివాసా ప్రాంతాలలో నిర్మించడం ద్వారా, ఫ్యాక్టరీ నుండి వెలువడే వ్యర్ధాలు, విషవాయువులతో పర్యావరణ కాలుష్యం జరగడంతో ప్రజలు అనేక అనారోగ్యాల పాలు అవుతారని, ఇలాంటి ఫ్యాక్టరీలను జన ఆవాసాల మధ్య నిర్మించి “ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దని” అధికారులను హెచ్చరిస్తూ, నిర్మాణ పనులు ఆపే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు: గుగ్గిల గ్రామ ప్రజలు
- Advertisment -