Monday, November 2, 2026

కరీంనగర్ లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తారుమారు: గంగుల కమలాకర్

మరోమారు బిఆర్‌ఎస్‌దే విజయం?
కరీంనగర్‌ (జనతా న్యూస్): అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వస్తున్న ఎగ్జిట్‌ పోల్స్‌ తలకిందులయ్యే విధంగా ఆదివారం జరిగే లెక్కింపులో ప్రజల తీర్పు బట్టబయలు అవుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజం కావని గతంలో అనేక సందర్భాల్లో రుజువు అయ్యిందన్నారు.  కేసీఆర్‌పై ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయని, ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని, అయినా ప్రజలు నమ్మడం లేదని అన్నారు. మంచి విద్య, ఉన్నత వైద్యం, నిరంతర సాగు, తాగునీరు, 24 గంటల విద్యుత్‌ సరఫరా ఇలా అనేక రంగాల్లో దేశంలో తెలంగాణను కేసీఆర్‌ మొదటి స్ధానంలో నిలిపారన్నారు. ఇవే తెలంగాణలో కెసిఆర్‌ను ఆదరిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలనే విధంగానే ఓటింగ్‌ సరళి కొనసాగిందన్నారు. ప్రజలు ఎంతో చైతన్యవంతులని, బీఆర్‌ఎస్‌ను తిరిగి అధికారంలోకి తేవాలనే సంకల్పంతో ఈ సారి సైలంట్‌గా తీర్పు ఇచ్చారని అన్నారు. రాష్టాన్రికి ఎలాంటి నాయకుడు అవసరమో? ఎలాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో అన్నది ప్రజలు గుర్తించారని, అదే క్రమంలో ఓటింగ్‌ సరళి ఉందన్నారు. లోతుగా ప్రజలు ఆలోచన చేసి ఓటు వేశారన్నారు.
- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page