ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలను పోలింగ్ సరళిని మానకొండూరు నియోజకవర్గం బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. అదేవిధంగా కందికట్కూరు గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించి ఓటింగ్ ఎలా జరుగుతుందో ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి సర్పంచ్ ఎంపీటీసీ నాయకులను ఓటింగ్ ఎలా జరుగుతుందని అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆయన వెంట ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, జడ్పిటిసి సిద్ధం వేణు, గడ్డం నాగరాజు, ఎంపీటీసీ ముగ్గు నరసయ్య యాదవ్, చింతలపల్లి వేణు రావు, కందికట్కూరు సర్పంచ్ లతోపాటు వివిధ స్థాయి నాయకులు ఆయన వెంట ఉన్నా
ఇల్లంతకుంటలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రసమయి బాలకిషన్
- Advertisment -