Monday, October 26, 2026

హిందూ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

  • హిందూ ధర్మ రక్షణ సేవా సమితి వ్యస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దోనె అశోక్

కరీంనగర్, జనతాన్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హిందూ ఆలయాలపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని హిందూ ధర్మ రక్షణ సేవా సమితి వ్యస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దోనె అశోక్ డిమాండ్ చేశారు. ఓ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ లో ముస్లిం డిక్లరేషన్ కోసం నిధులు ఎలా సేకరిస్తారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి హిందూ దేవాలయాలకు చెందిన భూములను వేలం వేసి వచ్చిన డబ్బులతో ముస్లింలను ఆదుకుంటాం అని అనడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ముస్లిం లపైన ప్రేమ ఉంటే వారిని ఆదుకోండి కానీ హిందూ దేవాలయ భూములను వేలం వేయడానికి మీరు ఎవరని ప్రశ్నించాడు. రాజకీయ లబ్ది కోసం హిందువులను చులకనగా చేస్తూ దేవాలయ భూములను వేలం వేస్తామని అంటే హిందూ సమాజం ఊరుకోదు అని హెచ్చరించారు. గతంలో కూడా హిందువుల పట్ల చులకనగా మాట్లాడిన రాజకీయ నాయకులకు పట్టిన గతే మీకు పడుతుంది అని అన్నారు.. ఇప్పటికైనా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే రానున్న రోజులలో పార్టీకి హిందూ సమాజం తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page