మంథని, జనతా న్యూస్: మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి, మామూలు కుటుంబంలో పుట్టిన బీసీబిడ్డగా నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానని అన్నారు. మంథని నియోజకవర్గం అభివృధ్దిలో పరుగులుపెట్టాలంటే ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఇప్పటికే తాను ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృధ్దితో పాటు తన తల్లిపేరున స్థాపించిన ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించానన్నారు. సంక్షేమ, అభివృద్ది, సేవ నా ప్రధాన ఏజేండాలని ఆయన అన్నారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత అభివృధ్దిని పేదోళ్లకు తనవంతుగా సేవ చేసి చూపించానని ఆయన గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లకు అవకాశం ఇస్తె ఎలా అభివృధ్ది చేస్తారో మీరే చూశారని, అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే కనబడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ సభ సక్సెస్‌కు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి మరువలేనిదని, సమిష్టిగా ప్రజలను తరలించడంలో ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు.నియోజకవర్గ ప్రజలు సైతం బీసీ బిడ్డను కాపాడుకోవాలని బారీగా తరలివచ్చి ఒక మంచి సందేశం ఇచ్చారని, అంచనాకు మించి ప్రజలు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.
మంథని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ నామినేషన్
- Advertisment -