Chattishgarh : ఛత్తీస్ గడ్ లో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు మావోయిస్టు పేలుళ్లు కలకలం సృష్టించాయి. తొలివిడతలో భాగంగా మంగళవారం 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని దొండ మార్కా నుంచి ఎల్మగుండ గ్రామం మధ్యలో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో సీఆర్ పీఎఫ్ జవాన్ శ్రీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు పోలీస్ అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో మోహ్లమాన్ పూర్, అంతగర్హ్, భాను ప్రతాప్ పూర్, కాంకేర్, కేశ్ కళ్, కొండగావ్, నారాయణపూర్ తంతెవాడ, బీజాపూర్ లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ జరగనుంది. అయితే మిగతా ప్రాంతాల్లో 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఛత్తీస్ గఢ్ లో ఓ వైపు పోలింగ్.. మరో వైపు పేలుళ్లు..
- Advertisment -