బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిణి దారుణ హత్యకు గురయ్యారు. భూగర్భ గనుల శాఖలో పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ బదిలీపై ఇటీవలే బెంగుళూరుకు వచ్చారు. ఈ తరుణంలో ఆమె హత్యకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కేఎస్ ప్రతిమ 2017లో భూగర్భ గనుల శాఖలో ఉద్యోగంలో చేరారి. అప్పటి నుంచి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లో పనిచేశారు. రామనగర జిల్లాలో పనిచేసిన ఆమె ఇటీవలే బెంగుళూరుకు బదిలీ య్యారు. నగరంలోని దొడ్డకల్లసంద్రలోని గోకుల అపార్టుమెంట్ లో ఒంటరిగా ఉంటున్నారు. శనివారం రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నారు.ఆయితే ఆమె సోదరుడు ప్రతీక్ రోజూవారీలో భాగంగా ప్రతిమకు ఫోన్ చేశారు. అయినా స్పందించకపోవడంతో పక్కనున్న వారికి ఫోన్ చేశారు. వారు సమాచారం ఇవ్వడంతో ప్రతిమ నివాసారికి వచ్చి చూసేసరికి ఆమె మరణించి ఉంది.
An employee working under the Karnataka government was stabbed to death at her residence in Bengaluru’s Doddakallasandra on Saturday. The 43-year-old geologist — identified as KS Pratima — was a Deputy Director in the Mines and Geology Department of Karnataka. The accused broke… pic.twitter.com/C6cXcXWjOS
— Madhuri Adnal (@madhuriadnal) November 5, 2023
ప్రతిమకు 18 ఏళ్ల కిందట సత్యనారాయణ అనే వ్యక్తితో వివాహం అయింది. ఇటీవలే సొంతూరు తుడ్కిలో కొత్త ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేశారు. అయితే వ్యవసాయ పనుల్లో భాగంగా భర్త, కుమారుడు అక్కడే ఉన్నారు. విధుల్లో భాగంగా ప్రతిమ బెంగుళూరులో ఒంటరిగా ఉంటోంది. అయితే ఆమె హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్వేషిస్తున్నారు.