Saturday, October 31, 2026

‘సిరిసిల్ల’ కాంగ్రెస్ లో ఆందోళన

సిరిసిల్ల, జనతా న్యూస్:  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్ పై సస్పెన్స్ వీడడం లేదు. రాష్ట్రంలో కీలక నియోజకవర్గం సిరిసిల్ల. ఎందుకంటే ఇక్కడ సీఎం కుమారుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కేసీఆర్ పై పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ రుద్రమదేవిని బరిలో నిలిపారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరా? అనేది తేలడం లేదు. కాంగ్రెస్ టికెట్ కోసం కేకే మహేందర్ రెడ్డి, సంగీతం శ్రీనివాస్, చీటి ఉమేష్ రావులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఎవరికి వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బిజేపీ టికెట్ స్థానికేతరులకు కేటాయించారనికొందరు బీజేపీ నాయకులు బీర్ఎస్ లో చేరారు. ఆ పరిస్థితి తమకు రావొద్దనే ఉద్దేశంతో అప్పుడే టికెట్ కేటాయించొద్దన్నట్లు అధిష్టానం భావిస్తోంది. కానీ నామినేషన్ల పర్వం మొదలైనా.. అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో కాంగ్రెస్ కేడర్ లో ఆందోళన నెలకొంది. అభ్యర్థి ఎవరో తేలిస్తే ప్రచారం నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కొందరు ఆ పార్టీకి చెందిన నాయకులు వాపోతున్నారు. అయితే కేటీఆర్ ను ఎదుర్కొనే ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో కేటీఆర్ పై పోటీ చేసేందుకు ఎవరు సిద్ధమవుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page