మంథని, జనతా న్యూస్: ఎమ్మెల్యే శ్రీధర్ బాబును తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాదని క్షణికావేశంలో బిఆర్ఎస్ పార్టీకి వెళ్లి తప్పు చేశానని కాటారం మండలం ధన్వాడ గ్రామ సర్పంచ్ నరేష్ నరేష్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సమక్షంలో ఆయన మాట్లాడుతూ సొంతగూటిని మంచి మనసున్న మనిషి శ్రీధర్ బాబును వదిలి బీఆర్ఎస్ లోకి వెళ్లడం తాను చేసిన తప్పుగా తెలుసుకున్నానని ఆయన ఆవేదన చెందారు. తాను చేసిన తప్పును తెలుసుకొని మళ్లీ వెంటనే సొంత గూటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహా ముత్తారం మండలం కనుకునూరు గ్రామానికి చెందిన 100 మంది యువకులు బిఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.
శ్రీధర్ బాబు సమక్షంలో సొంతగూటికి ధన్వాడ సర్పంచ్ నరేష్
- Advertisment -