కరీంనగర్ క్రైమ్, జనతా న్యూస్: కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల ఎల్.ఎం.డి పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు చేసిన లేదా అల్లర్లను సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని వారిని సంబంధిత అధికారుల ఎదుట బైండోవర్ చేయడంతో పాటు వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు.
అనంతరం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద గల స్టాటిక్ సర్వేలెన్సు టీం ఆధ్వర్యంలో గల చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహన తనిఖీల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు, అలసత్వం ప్రదర్శిస్తే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ వాహనాన్ని విడిచిపెట్టకుండా ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అక్రమ తరలింపులను గుర్తించినట్లయితే సీజ్ చేసే సమయంలో వీడియోగ్రఫీ చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసిపి తాండ్ర కరుణాకర్ రావు, తిమ్మాపూర్ ఇన్స్పెక్టర్, ఇంద్రసేనారెడ్డి, ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.