నిర్మల్, జనతా న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసమే పుట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా గురువారం ఆయన నిర్మల్, బాల్కొండలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మల్ లో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని జిల్లాలు చేద్దామని అని ఆలోచించగా ముందుగా మంచిర్యాల మాత్రమే అనుకున్నాం. కానీ బెజ్జూర్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో గంటసేపు వాదించిన మరీ ఇంద్రకరణ్ రెడ్డి నాలుగు జిల్లాలు చేయించారు. ఈరోజు తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయి ఉండేదా? అని అన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఒకదాని తరువాత ఒకటి అడుతున్నారు. ఇలా అభివృద్ధి చేసే నాయకులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సభతో ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి గెలచిపోయిండని తెలుస్తుంది.. అని కేసీఆర్ అన్నారు.
మరోవైపు బాల్కొండ సభలో మాట్లాడుతూ కొందరు ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ అడుగుతోంది. కాంగ్రెస్ కు ఇప్పటికే 11 అవకాశాలు ఇచ్చారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి, దేశానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. 2004 లో రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కేసీఆర్ అన్నారు.