Mlc Kavitha : హైదరాబాద్, జనతా న్యూస్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అరుదైన ఆహ్వానం లభించింది. లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీ లో ఉపన్యాసం ఇచ్చేందుకు ఆమె వెళ్లనున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి పై మాట్లాడేందుకు అక్టోబర్ 30న ప్రసంగించనున్నారు. తెలంగాణలోని వ్యవసాయ రంగం, 24 గంటల ఉచిత విద్యుత్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆమె కీలకోపాన్యాసం చేయనున్నారు. అలగే మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి నల్లా కలెక్షన్ గురించి చెపప్పనున్నారు. ఇటీవల చెన్నైలో బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆక్స్ ఫర్డ్ విద్యార్థులతో భేటీ అయ్యారు. దీంతో ఆమె కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వానం లభించింది.
Mlc Kavitha : ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగం చేయనున్న ఎమ్మెల్సీ కవిత
- Advertisment -