Monday, October 26, 2026

రాజకీయ పార్టీల ప్రచార ఖర్చులను లెక్కిస్తాం..

అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి

కరీంనగర్ (జనతా న్యూస్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో ప్రచారం కోసం చేసే ఖర్చులను ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుండి నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పార్టీలపై, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ వేసేనాటి నుండి అభ్యర్థుల ఖాతాలో ఖర్చులను లెక్కించడం జరుగుతుందని అన్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల్లో ఉపయోగించే వాహనాలు, వస్తువులు, ఆహార పదార్థాలకు ఇతర ఇతర ఖర్చులను లెక్కించడం జరుగుతుంది అని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల సంఘం సూచించిన ధరలను పరిశీలించి స్థానిక డిమాండ్ ను బట్టి ఆయా వస్తువులకు ఉండాల్సిన ధరల విషయంలో సూచనలు, సలహాలు అందించాల్సిందిగా తెలిపారు.
ఈ సమావేశంలో పొలిటికల్ పార్టీల ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి జే. మోహన్లాల్, బిజెపి పార్టీ ప్రతినిధి బోగి శ్రీనివాస్ , ఎంఐఎం పార్టీ ప్రతినిధి ఎండి మునీర్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి టి. జగదీశ్వర్ గుప్తా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి జి.మధు, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అసిస్టెంట్ రిజిస్టార్ అమృత్ సేన రెడ్డి, ఆర్టీవో జనార్దన్ రెడ్డి, డీఎస్ఓ తనూజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page