Tuesday, October 27, 2026

ఏబీవీపీ నగర కార్యదర్శిగా మాడవేణి సునీల్

జనత న్యూస్,  కోరుట్ల: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నూతన నగర కార్యవర్గాన్ని శుక్రవారం రోజున ఏబీవీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ రాపాక సాయికుమార్ ప్రకటించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలో అతి పెద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ అని, ఈ సమాజంలో అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలతో పాటుగా సామాజిక సమస్యల మీద అనేకమైన ఉద్యమాలు నిర్వహిస్తూ గత 73 సంవత్సరాలుగా ఏబీవీపీ దేశం కోసం సమాజం కోసం పనిచేస్తుందన్నారు.

జాతీయ సిద్ధాంతం పరంగా ముందుకు వెళ్లే విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని , ఇటువంటి సంస్థలో విద్యార్థులందరూ చేరాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా నూతన నగర కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండవసారి కూడా నూతనంగా నియామకమైన నగర కార్యదర్శి మాడవేణి సునీల్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నగర కార్యదర్శగా రెండవసారి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అని , విద్యారంగ సమస్యల మీద సమాజ సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ జాయింట్ సెక్రెటరీ మాసం వినయ్ , అభిమన్యు, మనోజ్, సాగర్, జోనల్ ఇంచార్జ్ ప్రణయ్ , హర్షవర్ధన్, సూర్య, రాఘవేంద్ర, మాడవేని పవన్, కిరణ్ , నాగేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page