Manthani : మంథని, జనతా న్యూస్: మంథని మండలం కాకర్ల పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకం కార్యక్రమంలో గురువారం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి అల్పాహార పథక కార్యక్రమం జరుగుతున్న తీరును ఆయన పర్యవేక్షించారు. అనంతరం ఆయన చేతుల పరిశుభ్రత గురించి వివరించి పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు. పొంగల్ సాంబార్ బాగుందని పిల్లల ఎదుగుదలకు ఉదయం టిఫిన్ అవసరం అని పిల్లలకు సూచించారు. అలాగే పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని తెలిపారు. పిల్లలతో పాటు నేల మీదనే కూర్చొని వానదేవుడా పాటను పిల్లలతో కలిసి పాడారు. పాఠశాల పరిస్థితిని సర్పంచ్ పద్మ కొమురయ్య వివరించగా మన ఊరు మన బడి ప్రపోజల్ చేద్దామని అన్నారు.తెనుగువాడ పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దాసరి లక్ష్మి ఐసి డి ఎస్ సిడిపిఓ పద్మశ్రీ ప్రధానోపాధ్యాయులు కోట లక్ష్మణ్ సహోపాధ్యాయుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Manthani : పొంగల్ సాంబార్ బాగుంది: కలెక్టర్
- Advertisment -