Saturday, October 31, 2026

Jagityala SP : చెక్ పోస్టు వద్ద పకడ్బందీగా తనిఖీలు

జగిత్యాల ఎస్పీ భాస్కర్

Jagityala SP : కోరుట్ల, జనతా న్యూస్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బు సరఫరా కాకుండా జిల్లాలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని బార్డర్లలో 7 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామని అన్నారు. ఇందులో భాగంగా బుధవారం నూతనంగా గండి హన్మండ్లు, ఓబులాపూర్ చెక్ పోస్ట్లను ఎస్పీ భాస్కర్ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం ఇతర జిల్లాల నుండి రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తారని తెలిపారు. డబ్బు మద్యం రవాణా జరగకుండా నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. అన్ని బార్డర్లలో చెక్ పోస్ట్ లను ప్రత్యేక గదులతో నిర్మించామని, ఇందులో సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తారన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు, శాంతి భద్రతల పరిరక్షణ కు పకడ్బందీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి డిఎస్పి రవీంద్రరెడ్డి, సి.ఐ లక్ష్మీనారాయణ ఎస్.ఐలు ఉమాసాగర్, చిరంజీవి, నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page