Sunday, November 1, 2026

Karimnagar : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు : కరీంనగర్ సీపీ

Karimnagar : కరీంనగర్, జనతా న్యూస్: జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా ఎన్నికల అధికారితో మరియు ఇతర శాఖల సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ ఎల్ . సుబ్బారాయుడు తెలిపారు, తద్వారా జిల్లాలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. జిల్లా లోని పోలింగ్ కేంద్రాల వివరాలు జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషనులు 1338, సాధారణ పోలింగ్ స్టేషన్లు 1048,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 290 ఉన్నాయి అని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు బైండోవర్ చేసిన కేసుల సంఖ్య 36 బైండోవర్ చేయబడిన వ్యక్తులు 128, గతంలో ఎలక్ట్రోరల్ నేరాలకు పాల్పడ్డ వ్యక్తులను మరియు అందులో సహకరించిన వ్యక్తులను బైండోవర్ చేయడమైనదని, రౌడీ షీట్ కలిగిన వారిని కూడా ముందస్తుగా బైండోవర్ చేయడం జరుగుతుందని చెప్పారు.

ఇప్పటివరకు 33 లిక్కర్ కేసుల నమోదు అయ్యాయని రూ. 2,17,335 /-రూపాయలు స్వాధీనపరచుకున్న ట్లు తెలిపారు.అన్ని ప్రభుత్వ శాఖల సమక్షంలో, సమన్వయము తో జిల్లా సరిహద్దుల్లో ఉన్న 5 ప్రాంతాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రణాళికతో 5 అంతర్ జిల్లా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అవి 1. ముగ్దుంపుర్, 2. అర్నకొండ చొప్పదండి మండలం 3. రేణికుంట (కొత్తపల్లి మండలం) 4. పరకాల ఎక్స్ రోడ్, (హుజురాబాద్ మండలం) 5. సిరిసేడు (ఇల్లంతకుంట మండలం) ఈ చెక్ పోస్ట్ ల ద్వారా అక్రమ రవాణా అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు.

జిల్లాలో ఏదేని ప్రదేశంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన లేదా శాంతి భద్రతల చర్యలకు విఘాతం కలిగించే చర్యలను వేగవంతంగా, సమర్థవంతంగా నిరోధించుట కొరకు మరియు అదుపులోకి తీసుకునేందుకు ఒక ఏసీపీతో కూడిన ప్రత్యేక టీంలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.వీటితోపాటు అదనంగా సాయుధ పటాలం (AR) నుంచి టీం లు, ఈ టీం ల యొక్క సమన్వయము కొరకు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం కొరకు ఒక్కొక్కరు చొప్పున ఇంచార్జ్ లను కేటాయించడం జరిగిందని సీపీ తెలిపారు..

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page