Sunday, November 1, 2026

Venkatesh : సురేందర్ రెడ్డితో వెంకీ కమిట్మెంట్.. స్టోరీ ఎలా ఉంటుందంటే?

ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్ ఆ తరువాత ఎక్కువగా యాక్షన్ మూవీస్ లో నటిస్తున్నారు. ‘దృశ్యం’, ‘నారప్ప’ ల తరువాత భారీ యాక్షన్ మూవీ ‘సైంధవ్’లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు 74 చిత్రాల్లో నటించిన వెంటకీ ఇప్పుడు 75వ మూవీతో థియేటర్లోకి రాబోతున్నాడు. శైలేస్ కొలను ఈ సినిమాకు డైరెక్టర్.త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంతో వెంకీ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్ తో కమిట్ అయినట్లు తెలుస్తోంది.

సినిమాలే కాకుండా వెబ్ సిరీసులతోనూ వెంకటేష్ అలరిస్తున్నారు. తన అన్న కొడుకు రానాతో కలిసి రానా నాయుడులో నటించి మెప్పించాడు. ఈ సీరీసులో వెంకీ యాక్షన్ అదుర్స్. కానీ మూవీ భారీ డిజాస్టర్ కావడంతో మరోసారి వెబ్ సిరీస్ వైపు వెళ్లలేదు. కానీ వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా వెంకీకి స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్టోరీ బాగా నచ్చడంతో సురేందర్ రెడ్డితో సినిమా తీయడానికి వెంకటేష్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

కిక్, రేసుగుర్రం వంటి బంపర్ హిట్టు చిత్రాలు తీసిన సురేందర్ రెడ్డి ఆ తరువాత తీసిన కొన్ని ఆకట్టులేకపోయాయి. అయితే ఇప్పుడు వెంకీతో తీయబోయే మూవీ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. సురేందర్ రెడ్డి ఇప్పటి వరకు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి సినిమాను తీశాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో స్టార్ హీరోలతో సురేందర్ రెడ్డికి కలిసి రావడం లేదన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ ప్రస్తుతం వెంకీతో తీయబోయే స్టోరీ విభిన్నంగా ఉంటుందన్న చర్చ సాగుతోంది.

సెలెక్టివ్ కథలతో ముందుకు వెళ్తున్న వెంకటేష్ ఈ యాక్షన్ సినిమాలో ఎలా కనిపిస్తాడోనన్న ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ సినిమాతో బిజీగా మారాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికీ లాంటి వారు ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page