వైఎస్సార్ జిల్లా: బిల్లులు లేకుండా భారీ ఎత్తు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు ఐటీ అధికారులకు సమాచారం అందడంతో ఆదివారం ఏపీలోని పలు జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 300 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఏపీలోని వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో నాలుగు బంగారం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా.. ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు ప్రొద్దుటూరులో పలు జువెల్లర్స్ షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా బంగారం లభ్యమైనట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇవన్ని ఇతర ప్రాంతాల నుంచి బిల్లలు లేకుండా దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు.
300 కిలోల బంగారం స్వాధీనం
- Advertisment -