-మానకొండూర్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్
మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి జనత న్యూస్:తాను స్థానికంగా ఉంటున్నానని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా అని ఈ ప్రాంతాల సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నవాడని తాను ఆస్తుల పెంపు కోసం ఏనాడు పాటుపడలేదని తననే గెలిపించాలని మానకొండూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ కోరారు ఆయన బుధవారం ఇల్లంతకుంట మండలంలోని సోమవారం పేట వెంకట్రావుపల్లి గొల్లపల్లి జంగాపల్లి తిప్పాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాను సర్పంచ్ గా పనిచేశానని జెడ్పి చైర్మన్గా ఎమ్మెల్యేగా పనిచేశానని మానకొండూర్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామాన్ని తిరిగానని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ తనకు క్షుణ్ణంగా తెలుసునని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు విజీట్ వీసా లాంటివారని వారు ఎన్నికల అనంతరం మనల్ని మరుస్తారని ఎన్నికల అప్పుడే మళ్ళీ అగుపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు ఆయనకు ఆయా గ్రామాలలో ఘనస్వాగతం లభించింది