మానకొండూర్ నియోజక వర్గం , జనత న్యూస్
సిపిఎస్ విధానం రద్దు చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు కు వినతి పత్రం అందజేసినట్లు టీ సీ పీ ఎస్ ఈ ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లీ లో విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ పీ ఆర్ టీ యు వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి టీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల కృష్ణకుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పులి దేవేందర్ రాష్ట్ర కార్యదర్శి చేరాల తిరుపతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఆకుల చంద్రశేఖర్ రాష్ట్ర నాయకులు తాళ్ల నాగరాజు వున్నారు. సిపిఎస్ రద్దుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్యులు తెలిపారు. ఈమేరకు త్వరలో తాము సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు అని ఆయన తెలిపారు .