కరీంనగర్ టౌన్ : పార్టీ ఏదైనా ప్రచారానికి వెళుతున్న సామాన్యులు. ప్రచారంలో పాల్గొన్నందుకు మనిషి ఒక్కరికి రు.300 నుండి రు.500 వరకు చెల్లిస్తున్నారు . ఈ ప్రచారానికి మనుషులను పంపడానికి ఏజెంట్లుగా కొందరు చలామణి అవుతున్నారు. ఎన్నికల సమయంలో పనులు లేకపోవడంతో చాలామంది ఇల్లు గడవడానికి పార్టీల తరఫున ప్రచారానికి వెళుతున్నారు. అయితే ఏజెంట్లు కింది స్థాయి నాయకులు తమకు తక్కువ చెల్లిస్తున్నారని వాపోతున్నారు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళు పిలిచినా వెళ్తున్నామని తెలిపారు. ఎన్నికల పరిశీలకుల కళ్ళు కప్పి జెండాలు లేకుండా వ్యాన్లలో ప్రజలను తరలిస్తున్నారు. డబ్బులకు ప్రజలను తరలిస్తున్న ఎన్నికల పరిశీలకులు చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. డబ్బులు తరలించిన ఏజెంట్లు డబ్బుల పంపకాలలో తేడాలు రావడంతో కొన్నిచోట్ల గొడవలు జరగడం కోసం మెరుపు.
ప్రచారానికి మనుషులు సిద్ధం
- Advertisment -