Thursday, September 24, 2026

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనగాం శంకర్ నియామకం

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన జనగాం శంకర్ నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా అధ్యక్షుడు తప్పెట శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగాం శంకర్‌ను జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జనగాం శంకర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా అధ్యక్షుడు తప్పెట శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శంకర్ తెలిపారు. ఎస్సీ వర్గాల సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి సంక్షేమం, హక్కుల కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -
- Advertisment -
- Advertisment -

Trending...

సుందరగిరి ఊరచెరువుకు జలకళ

.. మత్తడి వద్ద గ్రామ సర్పంచ్ శిరిష ప్రత్యేక పూజలు చిగురుమామిడి, జనత న్యూస్: గ్రామ...

కల్లేపల్లి గ్రామానికి జలకళ

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. చెరువులోకి భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను...

జంగాపల్లిలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

బెజ్జంకి, సెప్టెంబర్‌ 24 (జనతా న్యూస్): గన్నేరువరం మండలం జంగాపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. జంగాపల్లి సర్పంచ్‌ తాడూరి కర్ణ–శ్రీ వెంకట...

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా...

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన...
- Advertisment -

Most Popular

సుందరగిరి ఊరచెరువుకు జలకళ

.. మత్తడి వద్ద గ్రామ సర్పంచ్ శిరిష ప్రత్యేక పూజలు చిగురుమామిడి, జనత న్యూస్: గ్రామ...

కల్లేపల్లి గ్రామానికి జలకళ

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి గ్రామంలో నరసింహ చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకుతోంది. చెరువులోకి భారీగా నీరు చేరడంతో పరిసర ప్రాంతాలు జలకళను...

జంగాపల్లిలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

బెజ్జంకి, సెప్టెంబర్‌ 24 (జనతా న్యూస్): గన్నేరువరం మండలం జంగాపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. జంగాపల్లి సర్పంచ్‌ తాడూరి కర్ణ–శ్రీ వెంకట...

కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జనగాం శంకర్...

బెజ్జంకి, సెప్టెంబర్ 24, జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన...

You cannot copy content of this page