Wednesday, October 28, 2026

ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఘనస్వాగతం పలికిన బెజ్జంకి మండల కాంగ్రెస్ శ్రేణులు

జనతా న్యూస్ బెజ్జంకి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి, శాసన సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం మొదటిసారి మానకొండూరు నియోజకవర్గం లో బెజ్జంకి మండలం రేగులపల్లిలో “నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి” తన నియోజకవర్గంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండలం వివిధ గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను,ప్రజలను, అభిమానులను ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ అభివాదం చేస్తూ, తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్న, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల సహకారంతో నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి నడుం బిగిస్తానని తెలిపారు.

ప్రత్యేక ఆకర్షణగా బేగంపేట కార్యకర్తలు

ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలం బేగంపేట కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, త్రోపులాట లేకుండా క్రమశిక్షణగా, మండలంలోని సహచర గ్రామాల కార్యకర్తలకు సహకరిస్తూ అందరూ ఎమ్మెల్యేను కలిసే వరకు నిబద్ధతతో నిరీక్షించి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు బేగంపేట కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్వాగత కార్యక్రమాన్ని   కార్యకర్తల సహకారంతోవిజయవంతం చేయడం జరిగింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page