జనతా న్యూస్ బెజ్జంకి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించి, శాసన సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం మొదటిసారి మానకొండూరు నియోజకవర్గం లో బెజ్జంకి మండలం రేగులపల్లిలో “నేల తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి” తన నియోజకవర్గంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండలం వివిధ గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలను,ప్రజలను, అభిమానులను ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ అభివాదం చేస్తూ, తన విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్న, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల సహకారంతో నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని, నియోజకవర్గ అభివృద్ధికి నడుం బిగిస్తానని తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా బేగంపేట కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండలం బేగంపేట కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, త్రోపులాట లేకుండా క్రమశిక్షణగా, మండలంలోని సహచర గ్రామాల కార్యకర్తలకు సహకరిస్తూ అందరూ ఎమ్మెల్యేను కలిసే వరకు నిబద్ధతతో నిరీక్షించి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు బేగంపేట కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్వాగత కార్యక్రమాన్ని కార్యకర్తల సహకారంతోవిజయవంతం చేయడం జరిగింది.