YS Sharmila: విజయవాడ, జనతా న్యూస్: కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెలువరించిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలుకూడా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార వైసీపీ, టీడీపీ కూటమిలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. అయితే లేటేస్టుగా కాంగ్రెస్ జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏఐసీసీ సూచనల మేరకే ఆమె ఇక్కడి నుంచి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ లోని పలువురు సీనియర్లు కూడా పోటీలో ఉంటారు.
YS Sharmila: కడప నుంచి షర్మిల పోటీ?
- Advertisment -