Ys Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వివేకా హత్య కేసు పై వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై వైయస్సార్ జిల్లా బుద్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికలవేళ వివేకా హత్య అంశంపై మాట్లాడవద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి పై కూడా కేసు నమోదైంది. ఆర్వో శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రానికి వైసీపీ కండువాతో సుధీర్ రెడ్డి వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Ys Sharmila: వైఎస్ షర్మిలపై కేసు నమోదు
- Advertisment -