- వెంకట్ ఫౌండేషన్ ఛైర్మన్ గంప వెంకట్
కరీంనగర్,జనత న్యూస్:భవిష్యత్ తరాలు యువతదేనని, యువత ఆయా రంగాల్లో శిక్షణ పొంది దేశాభివృధ్ధిలో భాగస్వామ్యం కావాలని వెంకట్ ఫౌండేషన్ ఛైర్మన్ గంప వెంకట్ పిలుపు నిచ్చారు.అదివారం ఇంపాక్ట్ ఆధ్వర్యంలో స్థానిక వీ కన్వెన్షన్ లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమానికి గంప వెంకట్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రానున్న రోజుల్లో ప్రపంచంలో భారత్ అగ్ర రాజ్యాల సరసన చేరనుందని, మానవ వనరులను వినియోగంలోకి తీసుకువస్తే శక్తి వంతమైన దేశంగా ఏర్పడుతుందన్నారు.వాహనాల కాలుష్యం,థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి సోలార్ విద్యుత్ ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. వెంకట్ రావు,ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కరీంనగర్ శాఖ అధ్యక్షుడు తిరుపతి, శిక్షకులు సుధాకర్, శ్రీనివాస్, జాహ్నవి, సాయిబాబు,అధిక సంఖ్యలో ట్రైనర్స్ పాల్గొన్నారు.