జనత న్యూస్ బెజ్జంకి : మండలంలోని బెజ్జంకి ఎక్స్ రోడ్లో డ్రోన్స్ సహాయంతో పురుగుల మందులు పంట పొలాలపై స్ప్రే చేస్తున్న యువ రైతులతో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని సత్వర అభివృద్ధి చెందాలని సూచించారు.అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని వాటిని సద్వినియోగ పరుచుకుంటూ వ్యవసాయాన్ని సాగు చేస్తున్న స్థానిక యువ రైతులను అభినందించారు.
యువత స్వయం ఉపాధి పై దృష్టి పెట్టాలి: మాజీ ఎంపీ వినోద్ కుమార్.
- Advertisment -