Worldcup2023 : వరల్డ్ కప్ లో భాగంగా గురువారం బంగ్లాదేశ్, భారత్ ల మధ్య పోరు సాగనుంది. పూణె వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్ టాస్ లో బంగ్లాదేశ్ నెగ్గింది. దీంతో బ్యాటింగ్ ను ఎంచుకుంది. బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షాంటో ఓపెనర్ గా దిగాడు. భారత్ ఇప్పటి వరకు ఆడిని మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ జట్లను ఓడించిన టీమిండియా బంగ్లాదేశ్ పై శ్రమ పడకపోవచ్చని అంటున్నారు. కానీ ఏ విషయాన్నైనా ఆషామాషీగా తీసుకోవద్దని విశ్లేషకులు అంటున్నారు.
టీమిండియా జట్టు నుంచి రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, బుమ్రా, జిరాజ్ఉన్నారు.
బంగ్లాదేశ్ తరుపున లిటన్ దాస్, తన్జిద్ హసన్, నజ్మెల్ షాంటో(కెప్టెన్) , మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హృదోయ్, ముష్పికర్ రహీమ్ మహమ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమ్మద్, ముస్తాఫిజర్ రెహ్మన్, షోరిపుల్ ఇస్లామ్ ఉన్నారు.