హైదరాబాద్ :
సినిమాలోనే కాదు..పవర్‌లోనూ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారాయన. వంద రోజుల పరిపాలనలోనే వరల్డ్ రికార్డు సాధించి..ఔరా అనిపించారు. ఆగస్టు 23న సర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ఓకే రోజు రాష్ట్రంలోని 13, 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడమే కాకుండా.. రూ.4,500 కోట్ల విలువైన ఈజీఎస్ పనులకు తీర్మాణాలు చేయించారు. గ్రామ పాలనలో ఇది అతిపెద్ద కార్యక్రమంగా వరల్డ్ రికార్డ్స్ సాధించింది. కాగా..సోమవారం హైదరాబాద్ నివాసంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుకు సంబంధించిన పత్రం, సంబంధిత మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కు అందజేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబుతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
వరల్డ్ రికార్డు సాధించిన పవన్ కళ్యాణ్

- Advertisment -