భారత్ ప్రధాని వ్యూహాత్మక అడుగులు
జనత డెస్క్ :
ప్రపంచ శాంతి, ఆయా దేశాలతో స్నేహ హస్తం అందించే దిశగా కృషి చేస్తోంది భారత్. గతంలో అనేక సందర్భాల్లో పలు దేశాల్లో స్ఫష్టం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ..తాజాగా ఉక్రెయిన్ పర్యటనలో మరోసారి స్ఫష్టం చేశారు. రష్యాతో యుద్దం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు వెళ్లి అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరపడం ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా చూశాయి. 1991లో ఉక్రెయిన్ స్వతంత్రం పొందిన తర్వాత తొలిసారి భారత ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లడం, వాణిజ్యం, ఆర్థిక సమస్యలు, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్యతో సహా పలు రంగాలపై చర్చలు జరుపడం విశేషం. రెండు దేశాల మధ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల పరస్పరం రెండు దేశాలకు మేలు జరిగే అవకాశాలున్నాయి. 2024-2028 కోసం సాంస్కృతిక సహకారం కోసం కార్యక్రమం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. బారత్, ఉక్రెయిన్ ప్రభుత్వాల మధ్య వ్యవసాయం, ఆహార పరిశ్రమ రంగాలలో సహకారంపై ఒప్పందాలపై ఇండియాలో మోదీ కృషిని ప్రజలు హర్షిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కు సైతం భారత్ నుండి సాయం అవసరం. ఏదీ ఏమైనా శాంతి సందేశంతో పాటు ఇరు దేశాల మధ్య పరస్పర ఒప్పందాలు చేసుకోడం వల్ల ఈ రెండు దేశాలకు మేలు చేకూరే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
ప్రపంచ శాంతి, స్నేహ హస్తం
- Advertisment -