జనత డెస్క్ :
రెండోసారి ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అత్యంత జనాధరణ కలిగిన నేతగా ఆయన నిలిచారు. అమెరికాలోని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో ఈ విషయం తేలింది. నరేంద్ర మోదీ 69 శాతంతో నెంబర్ వన్‌గా నిలవగా..మెక్సికో అధ్యక్షులు లోపెజ్ ఒబ్రెడర్ 63 శాతంతో రెండో స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. భారత ప్రధాన మంత్రిగా మూడోసారి ఎన్నికైన నరేంద్ర మోదీకి..జాతీయ స్థాయిలో గతంలో కంటే కొంత ప్రభావం తగ్గినట్లుగా ప్రచారం జరిగినా..ప్రపంచ స్థాయిలో మాత్రం ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదనేది ఈ సర్వే ద్వారా తేలింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ అనేక విషయాల్లో తనదైన ముద్రను వేసుకుంటున్నారు నరేంద్ర మోదీ.