- హెడ్ బ్యాటింగ్ జోరు
- నిరాశతో భారత అభిమానులు
(ఎస్ వీ రమణాచారి, సీనియర్ జర్నలిస్ట్)
ప్రపంచ కప్ అంతిమ యుద్ధం ముగిసింది.నాకవుట్ మ్యాచులో తామే హీరోలమంటూ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఆస్ట్రేలియా జట్టు.ఆరో సారి కప్ ను తమకు దక్కించు కుంది ఆస్ట్రేలియా.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లకు 240 పరుగులకే ఆల్ ఔట్ అయింది..సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా టీం మొదట తడబడినప్పటికీ హెడ్ సెంచరీ (137) , అబూషేన్ హాఫ్ సెంచరీ(58)తో ప్రపంచ కప్ సొంతం చేసుకుంది.2003లో ఫైనల్స్ లో తలబడిన టీం ఇండియా మరియు ఆస్ట్రేలియా తిరిగి 20 సంవత్సరాల తరువాత 2023 లో కూడా ఈ రెండు టీంలు ఫైనల్స్ కి చేరుకున్నాయి.ఆస్ట్రేలియా 2003లో గెలుచుకున్నట్లే 2023లో కూడా భారత్ పై గెలిచి కప్ సొంతం చేసుకుంది.ఆస్ట్రేలియా బ్యాటర్ స్ట్రా విష్ హెడ్ 137 పరుగులు చేసి సంచలనం సృష్టించారు.ప్రపంచ కప్ ను అవలీలగా తన జట్టుకు అందించి క్రికెట్ చరిత్రలో తన పేరును బంగారు అక్షరాలతో లిఖింపచేసుకున్నాడు.ఆతనికి లబుషేన్ అండగా నిలిచారు.6 వికెట్లు,7 ఓవర్లు వుండగానే ఆస్ట్రేలియా జట్టు విజయకేతనం ఎగరేసింది.ఈ ఘటన భారత జట్టు అభిమానులనునిరాశ పరిచింది. ఆస్ట్రేలియా జట్టు 241 పరుగుల కు నాలుగు వికెట్స్ పోగొట్టుకొని ప్రపంచ కప్పు దక్కించుకుంది. ప్రతీ మ్యాచ్ లో ఓటమి లేకుండా ఫైనల్ కు చేరిన భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో చతికిల పడి పోయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు క్రికెట్ క్రీడాభిమానులు భారత్ గెలుపు కోసం కళ్ళలో వత్తులు వేసుకొని టీవీలకు హతుక్కు పోయారు.కేవలం 4 వికెట్ల కోల్పోయి ఆస్ట్రేలియా విజయ దుందుభి మోగించటం భారత అభిమానులను కుంగ దీసింది.నీలి సముద్రంగా మారిన మోదీ స్టేడియం భారత అభిమానుల కన్నీటి బిందువులతో తడిసి కన్నీటి సంద్రంగా మారింది. రోహిత్ శర్మ సారధ్యం లో కప్ మనకే దక్కుతుంది అనుకున్న అభిమానులు అసంతృప్తితో స్టేడియం నుంచి వెను తిరిగారు. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ మ్యాచ్ భారత్ ఓటమి తో క్రికెట్ అభిమానులు ఖంగు తిన్నారు.ఆస్ట్రేలియా ఆటగాళ్ల తీరును మెచ్చు కుంటూ క్రీడా స్ఫూర్తిని నింపు కుంటూ ఓటమి కూడా విజయమే..మళ్ళీ పోరాడి గెలుద్దాం అనుకుంటూ భారమైన బాధతో స్టేడియం నించి వెళుతూ.. టీవీ లను ఆఫ్ చేసి ఎవరికి వారే ఓదార్చు కుంటున్నారు….మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఆస్ట్రేలియా ఫేసర్లు వేసిన బంతులను భారత బ్యాటర్లు ఎదుర్కోలేక పోయారు.75 రన్స్ కే మూడు వికెట్స్ కోల్పోయిన భారత అభిమానులకు కోహిలీ ఆటతీరుతో కొంత సంతృప్తి చెందారు.ఒకదశలో కోహిలీ తన బ్యాటింగ్ మహిమతో స్కోరును కొంత వరకు పెంచేందుకు ఆడినప్పటికీ తాను చేసిన చిన్న పొరపాటుకే ఆ బాల్ వికెట్లను తాకటంతో పెవిలియన్ దారిపట్టారు. కోహిలీఅవుట్ కావటంతో భారత అభిమానులు కొంత నిరాశ నిస్పృహకు గురయ్యారు. ఆస్ట్రేలియా ఫేసర్ల ధాటికి భారత్ 4 వికెట్లను జార విడుచుకుంది.స్కోర్ 203 ఉండగా కెఎల్ రాహుల్ అవుట్ కావటం భారత్ అభిమానులను మరింత కుంగ దీసింది.ఆ తరువాత వచ్చిన భారత్ బ్యాటర్లు ఆశించినంతగా పరుగులు చేయక పోవటంతో అభిమానులు కలత చెంది కళతప్పి పోయారు.240 పరుగులకే భారత జట్టు ఆల్ అవుట్ అయింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు తక్కువ స్కోర్కే భారత బ్యాటర్లను ఇంటిదారి పట్టించారు.
భారత అభిమానుల ఆశలు..
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు మొదటి ఓవర్లో 15 పరుగులుచేసి పరుగుల జడివాన కురిపించారు. వెంట వెంటనే 47 పరుగుల కే మూడు వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా.పరుగుల వరదను ప్రహవహింపచేసే స్మిత్ ఎల్బీడబ్ల్యూ ఔట్ కావటంతో భారత్ బౌలర్ల కు ఆశలు చిగురించాయి.అభిమానుల్లో ఆనందం తాండవించింది.జై శ్రీరామ్,కమాన్ షమీ, భూమ్ర అనే నినాదాలు మిన్నుముట్టాయి.ఆ తర్వాత 70 పరుగుల వరకూ వికెట్ లాస్ కాకుండా గాప్ లోకి బాలును తోస్తూ పరుగులు తీస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ చాలా నింపాదిగా ఆడుతూ స్కోరును పెంచుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆటను ఆడుతూ తమజట్టు విజయానికి తోడ్పాటును అందించారు…2014 నుంచి 9 సార్లు నాకౌట్ సిస్టంలో భారత్ ఓటమి చెందిన విషయం తెలిసిందే.
హై లైట్స్…
- నరేంద్ర మోడీ స్టేడియం నీలి సముద్రంలా కనిపించింది.ఎక్కడ చూసినా నీలి జర్సీలతో అభిమానులు కనిపించారు.
- ఈ రోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉండటం పెళ్లి మూహర్తాలు,శుభ కార్యక్రమాలు ఉండటంతో పెళ్లి మంటపాలలో పెద్ద,పెద్ద స్క్రీన్ లు ఏర్పాటు చేశారు.
- ఈ రోజు ఆదివారం కావటంతో పలు హోటళ్లు,రెస్టారెంట్ల లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటీలు పడ్డారు. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పలు చోట్ల ఆయా రాజకీయ పార్టీల నేతలు బిగ్ స్క్రీన్ లు,టీవీ లను ఏర్పాటు చేశారు.