World Cup 2023: ప్రపంచకప్ లో భాగంగా భారత్ రెండో మ్యాచ్ అప్ఘ నిస్తాన్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా అప్ఘనిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభం కాగానే ఓపెనర్లుగా గుర్బాజ్, రహ్మనుల్లా క్రీజ్ లోకి వచ్చారు. తొలి ఓవర్ ను బూమ్రా వేశాడు. ఈ ఓవర్ లో బూమ్రా అద్భుత బౌలింగ్ ను ప్రదర్శించాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అది కూడా వైడ్ రూపంలో ప్రత్యర్థి జట్టుకు లభించింది. రెండో ఓవర్ ను సిరాజ్ వేశాడు. ఈ ఓవర్ లో ఐదు పరుగులు వచ్చాయి. ఆ తరువాత మరోసారి బూమ్రా రంగంలోకి దిగాడు. ఈ సారి కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తరువాత 5వ ఓవర్ లోనూ బూమ్రా వేసి ఒకే ఒక్క పరుగు ఇవ్వడం విశేషం.
World Cup 2023: కట్టుదిట్టంగా బుమ్రా బౌలింగ్
- Advertisment -