బెజ్జంకి టౌన్, జనతా న్యూస్: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బెజ్జంకి 2 మహిళ పొదుపు పరస్పర సహాయ సహకార పరిమితి సంఘ ఐదవ వార్షిక సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా సమితి అధ్యక్షురాలు రాపోలు విజయ మాట్లాడుతూ నెలలో కనీసం ఒకరోజు సంపాదనను మహిళలు పొదుపు చేయటం వల్ల వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా జీవితాన్ని స్వతంత్రంగా గడపగలిగే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేసే అవకాశమని అవిరత, నిర్ణిత , సాధారణ పొదుపులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశం మహిళా సంఘం అధ్యక్షురాలు జడల కవిత అధ్యక్షతన జరగగా కమిటీ పాలకవర్గ సభ్యులు బూట్ల రేణుక , బండి పెళ్లి పద్మ, పుల్లూరి వసంత , ఒడ్నాల అంజవ్వ, అంబరగొండ వాణిశ్రీ , బచ్చు నిర్మల, రాగుల కవిత, శంభు రాధవ్వ, రాగుల సుమలత, కవిత , గాదాసు విజయలక్ష్మి , ఘనకురాలు సంగ లత, పలువురు పొదుపు సంఘం మహిళా సభ్యులు పాల్గొన్నారు.
మహిళా పొదుపు సంఘం వార్షిక సమావేశం
- Advertisment -