మహిళా దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు వంటగ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రధాని ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. తమ ప్రకటనతో దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఇదిలా ఉండగా మార్చి 7న జరిగిన కేబినెట్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన సబ్సిడీని మార్చి 2025 వరకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమాదం తెలిపింది. 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై 300 సబ్సిడీ కొనసాగుతుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇప్పుడు రూ.100 తగ్గించడంతో మరింత వెసులుబాటు కానుంది.
ఉమెన్స్ డే స్పెషల్: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..
- Advertisment -