Friday, September 12, 2025

Womens Day Special: మహిళలూ.. దరఖాస్తు చేసుకోండి..

Womens Day Special:కరీంనగర్, జనత న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతి సంవత్సరం జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఈ ఏడాది కూడా రాష్ట్రస్థాయి అవార్డుల ఎంపికకు నామినేషన్లు స్వీకరించ నున్నట్లు ఆమె తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ఔత్సాహికులైన మహిళలు దరఖాస్తులను ఈ నెల 17 సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, ఇం.నెం.9`1`131, బాలరక్ష భవన్‌, భగత్‌నగర్‌ నందు సమర్పించాలని కోరారు. అన్ని పని దినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటలకు వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page