కోరుట్ల,( జనత న్యూస్ ): మహిళా దినోత్సవమును పురస్కరించుకొని ముందస్తుగా పట్టణంలోని మున్సిపల్ మహిళా పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి కోరుట్ల మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ సమక్షంలో ఉచిత మెగా వైద్య శిబిరమును నిర్వహించడం జరిగింది ఇట్టి ఉచిత మెగా వైద్య శిబిరంలో వైద్యులు మహిళా కార్మికులకు హెల్త్ చెకప్ లు చేసి మందులు అందించడం జరిగింది.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ పారిశుద్ధ విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మహిళ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఈ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు పట్టణ పారిశుద్ధ్యంలో పారిశుద్ధ మహిళ కార్మికులు చేసే సేవలు మరువరానివని వీరు పారిశుద్ధ విధులు నిర్వహిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు అందుకని ప్రతి ఒక్కరూ వారి సేవలను గుర్తించి వారిని గౌరవించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్,మున్సిపల్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది,మహిళా పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మహిళా కార్మికులను గౌరవించాలి…
- Advertisment -