Thursday, September 11, 2025

మహిళలు బాధ్యత యుతంగా పనిచేయాలి

కరీంనగర్, జనతా న్యూస్: మహిళా ఉద్యోగులు, సిబ్బంది తమ విధుల నిర్వహణలో బాధ్యత యుతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి కరీంనగర్ లోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా న్యాయమూర్తి, కలెక్టర్ ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమని, మహిళలకు ఆత్మగౌరవం, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హక్కుల సాధనకు కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు. తోటి మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసి ఆదుకోవాలని పేర్కొన్నారు. మహిళా సాధికారతతోనే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు.

collecter pamela 2
collecter pamela 2

ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలను సమానంగా చూసుకోవాలని సూచించారు. వరకట్నం ఇవ్వడం తీసుకోవడం నేరమని, దీన్ని అందరూ అడ్డుకోవాలని పేర్కొన్నారు. వివాహ బంధాలు కుదుర్చుకునే సమయంలో వరుడు, వధువు గుణగణాలు మాత్రమే చూడాలని, వరకట్నం ఇవ్వడం తీసుకోవడం చేయవద్దని సూచించారు. ఉద్యోగ బాధ్యతల్లో నిక్కచ్చిగా వ్యవహరించాలని, ఏం ఆశించకుండా పనిచేయాలని, అప్పుడే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్ ను టీఎన్జీవోస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన మహిళ ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మార్కెటింగ్ అధికారి పద్మావతి, ఆడిట్ ఆఫీసర్ రజిత, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ సునీత, టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి ఎస్ లక్ష్మన్ రావు, యూనియన్ ప్రతినిధులు నాగుల నరసింహస్వామి, రాజేష్ భరద్వాజ్ శారద, కిరణ్, రాగి శ్రీనివాసు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్ చే జారీ చేయనైనది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page