Friday, September 12, 2025

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జనతా న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ అధ్యక్షతలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నాకు మా గౌడ సంఘం తో పాటు పద్మశాలి సంఘం ఆడపడుచులు అంటే కూడా చాలా గౌరవం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడపడుచులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ బస్సులో ఉచిత ప్రయాణాలు కూడా మహిళలకు అందించడం జరిగిందని ఇకముందు కూడా మహిళ కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడతామని తెలిపారు.

చేనేత కార్మికుల ఐక్యత కోసం నేనెప్పుడూ ముందుంటానని మీకు ఎలాంటి సమస్య వచ్చిన నా దగ్గరికి రావచ్చని ఆయన అన్నారు. పద్మశాలి సంఘానికి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను ఎంతో కృషి చేశానని ఇకముందు కూడా మంత్రిగా నా బాధ్యతలను నిర్వహిస్తూ పద్మశాలి సంఘాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. మహిళా దినోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలంగాణ చేనేత కార్మికుల సమస్య పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని మీ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు.

అంతరం మంత్రి మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక కార్యనిర్వాహణాధికారి కోటిపల్లి సదానందం కోశాధికారి చిలువేరు గణేష్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, జడల చిరంజీవి,భాస్కర్, రావిరాల శ్రీనివాస్, వెంకటేశ్వర్లు మంచి కట్ల కోటేశ్వర్ మహిళ నాయకురాలు గుడా లావణ్య, చిందం సునీత, పోచం సునీత, కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ, అందే జ్యోతి, కృష్ణవేణి, బుర్ర మల్లేశం, స్వర్గం మల్లేశం, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page