రోజు రోజుకి జరుగుతున్న ఈ చేరికలే నిదర్శనం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని, జనతా న్యూస్: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మంథని నియోజకవర్గంలోని పలు మండలాలలోని గ్రామాలకు చెందిన మహిళాలుయువత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలు యువకులు చైతన్యవంతులే కొత్త రాజకీయానికి నాంది పలుకుతున్నారని అందుకు నిదర్శనమే రోజు రోజుకి జరుగుతున్న ఈ చేరికలేనని బీజేపీ పార్టీ గెలుపుకి నిదర్శనమని తెలంగాణలో మహిళలు యువకులు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పుకు అనుగుణంగా బిజెపి పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని రానున్న కాలంలో బిజెపి పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు.
కొద్ది రోజుల క్రితం అప్పుల బాధతో నెల్లిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తీవ్ర బాధాకరమని. ఈ ఘటన మరువక ముందే నిన్న రాత్రి వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక ఉద్యోగ నోటిఫికేషన్ వేసి పరీక్షలు వాయిదా వేయడంతో మనస్థాపంతో ఉరివేసుకొని మరణించిందని యువతను మహిళలను ఇన్ని రకాలుగా బాధ పెడుతున్న పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు జిల్లా అధికార ప్రతినిధి పోతర వేణి క్రాంతి కుమార్ పలు మండలాల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్ పెయ్యల కుమార్ మండల ఇంచార్జ్ తోట మధుకర్ మండల ప్రధాన కార్యదర్శిలు అరె ఓదెలు,అమ్ము శ్రీనివాస్ మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక నాయకురాలు కండె సౌమ్య సీనియర్ నాయకులు రేపాక శంకర్,కోరబోయిన మల్లిక్ లైసెట్టిబాబు లింగన్నపేట అశోక్ నూకల మహేందర్ తోట నాగరాజు బోసెల్లి శంకర్ కాసిపేట మల్లేష్ కురుమ శేఖర్ బుర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.