(మానకొండూరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్)
మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ లో జరిగిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వద సభ సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు గెలుపుపై ధీమా వచ్చింది.సీఎం తాము అమలు చేయనున్న కార్యక్రమాల్ని ప్రజలకు సవివరంగా వివరించారు.దానికి తోడు గా ఇవన్నీ అమలు కావాలంటే రసమయిని మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిపించాలిని కొరటం పలువురిని ఆకర్షించింది…మాటి మాటికీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో వివరిస్తూ ఇక్కడ రసమయిని గెలిపిస్తేనే అని అనటం అందరినీ ఆశ్చర్య పరిచింది.చివరికి సీఎం కేసీఆర్ ముగింపులో..సర్వేలో బాలకిషన్ నెంబర్ వన్ లో గెలుస్తాడని తేలిందని ఇకమీరు ఓట్లు వేయటమే అని కేసీఆర్ అనటంతో ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాల కిషన్ ఉబ్బితబ్బి అయ్యాడు…
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం అంటూ వస్తున్నారని, . వాళ్ళను నమ్మకండి.ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్ఠీఆర్ ఎందుకు పార్టీ పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, జైల్లో పెట్టడం,ప్రభుత్వాలు పడగొట్టటం.ఇందిరమ్మ రాజ్యం బాగుంటే మరి తెలంగాణ ప్రజలు ఎందుకు వలస పోయిండ్రు.ఇందిరమ్మ రాజ్యంలో పత్తి కాయలు పగిలినట్లు రైతుల గుండెలు ఎందుకు పగిలినయి..ఆత్మహత్యలు ఎందుకు పెరిగినయి.కరీంనగర్ కు నాకు ఏదో లింక్ ఉంది.ఏ స్కీమ్ ప్రకటించినా ఇక్కడి నుంచే ప్రకటిస్తా కదా..కరీంనగర్ భీముడు గంగుల కమలాకర్ కూడా గిదే అంటుండు.అంటూ ఆటో డ్రైవర్ లకు ఓ తీపి కబురు ప్రకటించారు సీఎం కేసీఆర్.ప్యాసింజర్ ఆటోలకు ఫీట్నెస్ ,పర్మిట్ ఫీస్ మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 100 కోట్ల బకాయి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు..ఒకో ఆటకు కనీసం రూ 1200 లు మాఫీ అయితవని దీంతో మన ఆటో అన్నలకు లాభం కలుగుతుందని చెప్పారు కేసీఆర్..వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇప్పటికే ఇస్తున్నాం.కాంగ్రెస్ వస్తే మనకు కరెంట్ మూడు గంటలే వస్తది మన మోటార్లు కలిపోతనే ఉంటయి. కాంగ్రెస్ వస్తే ధరణి ని తీసివేస్తామంటున్నారు ..వాళ్ళు భూమాత తెస్తామంటున్నారు. వారు తెచ్చేది భూమాతకాదు.. భూమేత అని ఏకసెక్కం చేశారు సీఎం కేసీఆర్…మానకొండూరు నియోజక వర్గంలో దళితులు ఎక్కువగా వున్నారు నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.