Wednesday, July 2, 2025

ముఖ్యమంత్రితో ఐబీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ భేటీ

హైదరాబాద్‌ :
సీఎం రేవంత్‌ రెడ్డితో బేటీ అయ్యారు ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన ఐబీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ డానియెలా కాంబ్‌. హైదరాబాద్‌ హెఐసీసీ వేదికగా జరుగుతోన్న గ్లోబల్‌ ఏఐ సదస్సు `2024 ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భవిష్యత్తు, నూతన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శివారు ఫ్యూచర్‌ సిటీలో 200 ఎకరాల ప్రాంగణంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తోన్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఫ్యూచర్‌ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికల పట్ల ఐబీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ గారు ఆసక్తి కనబరిచారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు , ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు , ఉన్నతాధికారులు, ఐబీఎం ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page