Revanth Reddy: వరంగల్, జనత న్యూస్: ఈనెల 13వ తేదీన జరిగే లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలలో రోడ్ షో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని కాబట్టి వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వరంగల్ పోచం మైదాన్ వరకు రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని రైతులకు రెండు లక్షల రూపాయలు ఆగస్టులోగా మాఫీ చేస్తామని, రైతు బంధు పథకం రైతుల ఖాతాల్లో జమ చేశామని, వరంగల్ నగల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానని ఆయన అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించుటకు ఒక కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని, పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందించే దిశగా ఒక ప్రణాళిక రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇప్పటికే అమలు చేసిందని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినంత బిజెపి ఇతర పార్టీలు ఎవరు కూడా అభివృద్ధి చేయలేదని. ప్రజల సమస్యలను పట్టించుకోని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచన చేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య ను నగర ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ రోడ్ షో కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క పశ్చిమ ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి, నాగరాజు, కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
