- పదేళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్న తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
- పొన్నం శిష్యుడిగా గుర్తింపు
- నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలంటున్న కార్యకర్తలు
కరీంనగర్, జనత న్యూస్: గత పదేళ్లుగా అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతోచాలా మంది కార్యకర్తలు పార్టీని పట్టుకొని ఉన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావంతో పార్టీ కోసం పనిచేసిన వారున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ జెండాతోనే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు తమకు న్యాయం జరుగుతుందా? అని అనుకుంటున్నారు. కమ్యూనిస్టుల కోట నుంచి కాంగ్రెస్ కంచుకోటగా మారింది హుస్నాబాద్ నియోజకవర్గం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది జాయిన్ అయి కొనసాగుతున్నారు. వారిలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ ఒకరు.
కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అనుక్షణం పేద ప్రజలకోసం పరితపిస్తున్నారు. ఎన్ ఎస్ యు ఐ కాలేజి ప్రెసిడెంట్ గా మొదలైనా ఆయన రాజకీయ ప్రస్థానం.. ఆ తరువాత కాంగ్రెస్ మండలాద్యక్షుడిగా మారాు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శిగా, ప్రస్తుతం తెలంగాణ గౌడ సంఘం జిల్లా ఉపాద్యక్షుడిగా,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబిసి రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ & బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ బలోపెతం కోసం తన వంతు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ఓ వైపు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ గోంతును బలంగా వినిపించిన యువ నేతగా పేరు తెచ్చుకున్నారు. పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితిగా పనిచేస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ శిష్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పేరుగాంచిన శ్రీనివాస్ గౌడ్
తనను నమ్ముకున్నా వాళ్లకోసం న్యాయం చేయడానికి ముందుకొస్తున్నారు. కష్టాలను, బాధలను తనలోనే దాచుకుని చిరునవ్వుతో నేనున్నాని భరోసా ఇస్తూ.. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్న తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ను పార్టీ అధిష్టానం గుర్తించాలని ఆయన అభిమానులు, అనుచరులు కోరుతున్నారు. త్వరలో నియామకం జరగబోయే నామినేట్ పదవులలో శ్రీనివాస్ గౌడ్ కు ప్రధాన్యం ఇవ్వాలని అంటున్నారు. పార్టీ కోసం ఎనలేని సేవ చేసిన వారిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ కు సరైన న్యాయం చేయాలని కోరుతున్నారు.